ప్రజాతెలంగాణ – కరీంనగర్: జూన్, జులై, ఆగష్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.జూన్ 1 నుంచి 30 వరకు బియ్యం, చక్కెర పంపిణీ చేస్తామని తెలిపింది. ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత సెప్టెంబర్‌లో మాత్రమే రేషన్ అందుతుందని వెల్లడించింది.ఒకేసారి మూడు నెలల రేషన్ లభించడం తో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే మూడు నెలల బియ్యం ఒకేసారి అందించడం తో పాటు ,సెప్టెంబర్ వరకు రేషన్ తీసుకునే అవకాశం ఉండకపోవడం తో మొదటి రోజే రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది.ఈ సందర్బంగా తగు సమయంలో రేషన్ తీసుకోవాలని శాఖ విజ్ఞప్తి చేసింది.
మరింత :
నేటి ప్రజావాణి రద్దు