ప్రజాతెలంగాణ- తిమ్మాపూర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేసి, సీసీసీ ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు పోలీస్ స్టేషన్‌లను తరచుగా సందర్శించి ఎస్సైల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెలా స్టేషన్ వారీగా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆకస్మిక పరిస్థితులకు లాఠీ, హెల్మెట్ వంటి రైట్ గేర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ఎస్‌హెచ్‌ఓలు స్టేషన్ మేనేజ్‌మెంట్‌ను సక్రమంగా నిర్వహించి, రికార్డుల నిర్వహణ, కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో నవీకరించాలని అన్నారు. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.డివిజన్‌లను సెక్టార్లుగా విభజించి ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్‌లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
గంజాయి, అక్రమ ఇసుక, పిడిఎస్ బియ్యం రవాణా, పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను “బ్లాక్ హోల్స్”గా గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఏసిపి శుభం ప్రకాష్, తిమ్మాపూర్ ఇన్‌స్పెక్టర్ జి సదన్ కుమార్, వివిధ స్టేషన్ల ఎస్సైలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :