ప్రజా తెలంగాణ -కరీంనగర్ : హైదరాబాదులో ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు మహాసభ జరుగుతున్న సందర్భంలో కరీంనగర్‌లోని ఆటో యూనియన్ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టు చేసిన వారిలో కరీంనగర్ జిల్లా బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ ఉన్నారు. ఆటో యూనియన్ సభ్యులు, పలువురు విచ్చేసి సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా బీఆర్టీయు అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చెయ్యాలని , సభలు చేయడానికి ఆటో డ్రైవర్లను అడ్డుకోకుండా తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు . లేకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని కొనసాగించవలసి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ,సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :