ప్రజాతెలంగాణ – కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని, పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సమక్షంలో నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు .సోమవారం శాంతినగర్‌లో జిల్లా విద్యాధికారి మొండయ్యతో కలిసి బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మేధావులు, అన్ని రంగాలకు చెందిన వారిలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని వివరించారు.బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వంత ప్రచార వాహనంతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన పది మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.చింతకుంట, శాంతినగర్, గాంధీనగర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివిధ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన పలు సమస్యలను సుడా నిధులతో పరిష్కరిస్తామని, క్లాస్ రూంలు, ప్రహరీ గోడ నిర్మాణంకు సంబంధించిన అంశాలను కలెక్టర్‌తో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 19వ తేదీ వరకు ఈ బడిబాట కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలలో కొనసాగిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆనందం, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్థానిక నాయకులు , విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :