ప్రజాతెలంగాణ-కరీంనగర్: ఈ నెల 7న జరగనున్న బక్రీద్ పండగ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతి ని కలిసి వినతి పత్రం అందజేశారు.మూడు రోజుల పాటు జరుపుకునే బక్రీద్ పండగను పురస్కరించుకుని, నగరం మరియు జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, 14 మండలాల పరిధిలోని మసీదులు, ఈద్‌గాహ్‌లకు శానిటేషన్, వాటర్, కరెంటు సౌకర్యాలను కల్పించాలని కోరారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా నిర్వహించాలని కూడా అభ్యర్థించారు.పండగ రోజుల్లో మెడికల్ కేంపులు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అభ్యర్థించారు. పార్కింగ్ వ్యవస్థ, మంచినీటి సదుపాయాలు కూడా కల్పించాలని విన్నపించారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసుల సహకారం కోరారు.వినతి పత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ మైనారిటీ నేతలు సమద్ నవాబ్, నేహాల్ అహ్మద్, అబ్దుల్ రహీమాన్, మొహమ్మద్ కలిమోద్దీన్, ఫిరోజ్ ఆరిఫ్ ఖాన్, గౌస్ భాయ్, హనీఫ్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :