విద్యార్థులకు నాణ్యమైన భోజనం తయారు చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ – రామడుగు : ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వంట చేసే సిబ్బందికి సూచించారు.మంగళవారం జిల్లాలోని అన్ని కేజీబీవీలు, బాలికల రెసిడెన్షియల్ హాస్టళ్లలో వంట చేసే 90 మంది సిబ్బందికి రామడుగు మండలం వెదిర గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి  హాజరై సిబ్బంది వంట చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. శిక్షణలో భాగంగా వంట సిబ్బంది తయారుచేసిన భోజనాన్ని రుచి…

మరింత

బడిబాట విజయవంతం చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ -కరీంనగర్ :  ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జూన్ 6 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బాల బాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో, ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించేట్లు చూడాలని అన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోని మెరుగైన సదుపాయాలను విస్తృతంగా ప్రచారం…

మరింత

బక్రీద్ పండగ ఏర్పాట్లకు కాంగ్రెస్ మైనారిటీ సెల్ వినతి పత్రం

ప్రజాతెలంగాణ-కరీంనగర్: ఈ నెల 7న జరగనున్న బక్రీద్ పండగ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దీన్ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి  ని  కలిసి వినతి పత్రం అందజేశారు.మూడు రోజుల పాటు జరుపుకునే బక్రీద్ పండగను పురస్కరించుకుని, నగరం మరియు జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, 14 మండలాల పరిధిలోని మసీదులు, ఈద్‌గాహ్‌లకు శానిటేషన్, వాటర్, కరెంటు సౌకర్యాలను కల్పించాలని కోరారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా నిర్వహించాలని కూడా అభ్యర్థించారు.పండగ రోజుల్లో మెడికల్…

మరింత

బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ-కరీంనగర్ : జూన్ 7న వచ్చే బక్రీద్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు పండుగ ఏర్పాట్లపై సూచనలు చేశారు.ఈద్గాల వద్ద అన్ని వసతులు కల్పించాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. నమాజ్ వేళల్లో కరెంటు కట్ లేకుండా చూడాలని ఆదేశించారు. మసీదుల వద్ద పరిశుభ్రత పాటించాలని,…

మరింత

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భూ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడు ప్రాథమిక పాఠశాలలో, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహనా సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో…

మరింత

నేటి ప్రజావాణి రద్దు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో నేడు (02.06.2025) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మరింత : జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్  

మరింత

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ – కరీంనగర్: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టి నీటి నమూనాలను పరీక్షించి క్లోరినేషన్ చేయాలని…

మరింత

జిల్లా విద్యాధికారి పై వేటు

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జిల్లా విద్యాధికారి జనార్దన్ రావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరిన్ని వార్తల కోసం : ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి – సీఎం రేవంత్ రెడ్డి

మరింత

ముగిసిన గ్రామ పాలన అధికారుల నియామక పరీక్ష

– పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ-కరీంనగర్ :  గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణ కోసం ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల (జిపిఓ) నియామక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లెక్టర్ సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రస్తుత…

మరింత

అత్యాధునిక వైద్యానికి కేరాఫ్ ప్రభుత్వాసుపత్రులు – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకునేలా వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శాఖ పనితీరు మరియు మాతృ శిశు సంక్షేమ చర్యలపై సమీక్ష నిర్వహించారు.ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఆసుపత్రులను ఇంటిలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!