– పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజాతెలంగాణ-కరీంనగర్ : గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణ కోసం ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల (జిపిఓ) నియామక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లెక్టర్ సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే . ఈ మేరకు జిపిఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు రాత పరీక్ష నిర్వహించారు.పరీక్షకు మొత్తం 189 మంది వీఆర్వో, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకోగా, వారిలో 172 మంది పరీక్ష రాశారు . కలెక్టర్ పరీక్ష కేంద్రంలో అధికారులతో మాట్లాడి అభ్యర్థుల వివరాలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్వో పవన్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, డివైఎస్ఓ శ్రీనివాస్, ఏవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :