ప్రజా తెలంగాణ -కరీంనగర్ రూరల్ : పిల్లల రక్షణ అందరి బాధ్యత అని వారి హక్కులు, చట్టాలపై అందరికి అవగాహన ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ అన్నారు.శనివారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కేంద్రంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రం లో ఆయన తో పాటు , సఖీ సెంటర్ అడ్మిన్ లక్ష్మి పాల్గొని బాలికల భద్రత, లింగ సమానత్వం , పిల్లల అక్రమ రవాణా గురించి అవగాహనా కల్పించి ఉపాధ్యాయుల పాత్ర, పిల్లల లో తీసుకురావాల్సిన మార్పు గురించి చర్చించారు, పోక్సో చట్టం 2012, బాల్య వివాహ నిరోధక చట్టం 2006 , జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 పై శిక్షణ కల్పించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, మహిళా హెల్ప్ లైన్ 181 ఏ విదంగా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మండల విద్యాధికారులు ఆనందం, రిసోర్స్ పర్సన్స్ , ప్రభుత్వ టీచర్లు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :