ప్రజా తెలంగాణ-కరీంనగర్ : కరీంనగర్ నగరం లోని పార్కుల స్థలాలను క్లబ్ స్థలాలుగా మార్చకుండా జిల్లా యంత్రాంగం పరిరక్షించాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు .శనివారం కరీంనగర్‌లోని హొటల్ తారక లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నగరంలోని పార్కుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో గతంలో 42 పార్కులు ఉండగా ప్రస్తుతం 35కి తగ్గినట్లు తెలిపారు. పార్కుల స్థలాలు కొన్ని క్లబ్‌లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించే పేరుతో రిజిస్టర్ అయిన పార్కులకు తాళాలు వేయడం ఏంటని ప్రశ్నించారు .గ్రామ పంచాయతీల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) జాబితా అధికారులు సరిగా నిర్వహించడం లేదన్నారు . దీనివల్ల పంచాయతీ భూముల రక్షణ సవాలుగా మారిందని తెలిపారు.
LRS (లే-అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) విషయంలో ప్రజలపై అధిక భారం పడుతున్నట్లు సర్దార్ రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, తాను మేయర్‌గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఒక రూపాయి అంత్యక్రియల (అంతిమ యాత్ర) పథకం సరిగా అమలు కావడం లేదని తెలిపారు. నగరంలో జరుగుతున్న అన్యాయాల పై వెంటనే జిల్లా కలెక్టర్ , కమిషనర్ లు స్పందించి చర్యలు తీసుకొవాలని కోరారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, తూల భాస్కర్ రావు, జయంత్, తివారీ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :