కరీంనగర్-ప్రజా తెలంగాణ : మే 17 , ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్ లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా కార్యాలయ సిబ్బందికి రక్తపోటు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించారు అనంతరం ప్రోగ్రాం అధికారులతో కలిసి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్నిజరుపుకుంటారని, ప్రజలందరూ ‘ఒత్తిడిని సమతుల్యం చేసుకొని , ఆరోగ్యకరమైన జీవితాన్నిఆస్వాదించాలని కోరారు .
ఆయన మాట్లాడుతూ, “అధిక రక్తపోటు వల్ల కలిగే సమస్యలను ఎదుర్కోవడం కంటే దానిని నివారించడం మంచిది. వయోజన జనాభాలో 45% మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇది అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలలో కనిపిస్తుంది మరియు వయసుతో పాటు పెరుగుతుంది,” అని వివరించారు.రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి
మందులతో పాటు ధ్యానం , అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవాలని ,నిత్యం నడక, వ్యాయామం మరియు యోగాసనాలు చేస్తూ సమతుల్యమైన నిద్రను పాటించాలని తెలిపారు.అధిక రక్తపోటు ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, సరైన మోతాదులో మందులు వాడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిఓడిటిటి డాక్టర్ ఉమా శ్రీరెడ్డి, పివో ఎన్‌సిడి డాక్టర్ విప్లవ శ్రీ, పిఓ ఎంసిహెచ్ డాక్టర్ సనా జవేరియా, డెమో రాజగోపాల్, డిపిఒ స్వామి, ఎన్‌సిడి సూపర్‌వైజర్లు పోచయ్య, శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మే 14 నుండి డిగ్రీ పరీక్షలు