ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో మే 14 నుండి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ తెలిపారు . ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన శనివారం కరీంనగర్ పట్టణంలోని వాణినికేతన్ డిగ్రీ కళాశాలను సందర్శించి, పరీక్షల నిర్వహణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, “విద్యా సంవత్సరంలో ఎటువంటి అంతరాయం లేకుండా తృతీయ సంవత్సర విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నాము” అని తెలిపారు.పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసి, ఫలితాలను సకాలంలో విడుదల చేయాలని పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేష్ కుమార్‌ను ఆదేశించారు.
మరిన్ని వార్తల కోసం :