133.8 కిలోల గంజాయి దగ్ధం: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు.మానకొండూరు మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో  డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు వేణుగోపాల్, విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం :…

మరింత

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు బుధవారం వెల్లడించారు.నార్కోటిక్ జాగిలం ‘లియో’తో జిల్లా కేంద్రంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు కమిషనర్ తెలిపారు. కరీంనగర్ ఒకటవ ఠాణా పరిధిలో బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో బస్టాండ్, పార్సిల్ కార్యాలయాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు, హాస్టళ్లు,…

మరింత

లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 3478 కేసుల పరిష్కారం

– పీపీలను అభినందించిన కమీషనర్ ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,478 కేసులను విజయవంతంగా పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ ఆలం అభినందించారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని , కేసుల పరిష్కారంలో పోలీసు అధికారుల నుంచి ఏదైనా సమన్వయ లోపం కనిపిస్తే…

మరింత

ముగ్గురు అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల అరెస్ట్

ప్రజాతెలంగాణ – కరీంనగర్, : జాబ్ ఆఫర్ల పేరుతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను కరీంనగర్ సైబర్ పోలీసులు  మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, రేటింగ్ రివ్యూ వర్క్, పార్ట్ టైం జాబ్స్ పేర్లతో బాధితుల నుండి మొత్తం ₹92 లక్షలు దోచుకున్న పూణే జిల్లా భోర్ తాలూకాకు చెందిన ప్రసాద్ సురేష్ గువహనే (26), చందన్ విట్టల్ గవనే (25), ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన శ్రేయస్ ముకుంద్ కలి (26) లను…

మరింత

కౌన్సిలింగ్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్: కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడిన తర్వాత కోపంతో ఆదివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్‌పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ విజయరావు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్‌పై ఉన్న సన్నీతో ఓపికగా మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేశాడు. యువకుడి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి పరిస్థితిని చక్కదిద్దాడు.సంయమనంతో కౌన్సిలింగ్ చేసి…

మరింత

లేక్ పోలీస్ ఇంచార్జ్‌గా ఆర్.ఎస్సై రమేష్ నియామకం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లేక్ పోలీస్ అవుట్ పోస్ట్‌కు ఆర్.ఎస్సై రమేష్‌ని ఇంచార్జ్‌గా నియమించారు. ఈ మేరకు గురువారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్.ఎస్సై రమేష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. డ్యామ్ పరిసరాల్లో నిఘా పటిష్టం చేసి, ప్రజలు సురక్షితంగా విహరించే వాతావరణాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వార్తల కోసం : ఎస్…

మరింత

తిమ్మాపూర్‌లో నేర సమీక్ష నిర్వహించిన సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- తిమ్మాపూర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేసి, సీసీసీ ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు పోలీస్ స్టేషన్‌లను తరచుగా సందర్శించి ఎస్సైల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెలా స్టేషన్ వారీగా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆకస్మిక పరిస్థితులకు లాఠీ, హెల్మెట్ వంటి రైట్ గేర్ సిద్ధంగా ఉంచుకోవాలని…

మరింత

బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు – రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ తెరిచి ఉండే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నారు . దీని వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ,మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొందరు గంజాయికి…

మరింత

పేకాటరాయుళ్ల అరెస్టు

– రూ. 3.65 లక్షల నగదు ,14 సెల్ ఫోన్లు స్వాధీనం ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ :కరీంనగర్ రూరల్ పరిధిలోని రేకుర్తిలోని పేకాట స్థావరంపై బుధవారం సీఐ ఏ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుండి రూ. 3,65,760 నగదు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సి ఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని…

మరింత

రాజీ కేసుల పరిష్కారానికి చర్యలు

కరీంనగర్ పోలీస్ కమిషనర్-ప్రిన్సిపల్ జడ్జి సమావేశం ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు :  కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎస్. శివకుమార్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 14న జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే కేసులను కోర్టుల వారీగా పరిష్కరించాలని ఈ సందర్భంగా కమిషనర్ జడ్జిని కోరారు. సమన్వయ సమావేశంలో పెండింగ్ కేసుల సమీక్ష లోక్ అదాలత్ సన్నద్ధతలో భాగంగా, బుధవారం కోర్టు ఆవరణలోని మీటింగ్…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!