- కరీంనగర్ పోలీస్ కమిషనర్-ప్రిన్సిపల్ జడ్జి సమావేశం
ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు : కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎస్. శివకుమార్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 14న జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే కేసులను కోర్టుల వారీగా పరిష్కరించాలని ఈ సందర్భంగా కమిషనర్ జడ్జిని కోరారు.
సమన్వయ సమావేశంలో పెండింగ్ కేసుల సమీక్ష
లోక్ అదాలత్ సన్నద్ధతలో భాగంగా, బుధవారం కోర్టు ఆవరణలోని మీటింగ్ హాలులో సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సెక్రటరీ వెంకటేష్ ఆధ్వర్యంలో కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లతో సమన్వయ సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉండి, రాజీపడిన కేసుల వివరాలను చర్చించారు. కక్షిదారులు మరియు ఫిర్యాదుదారులు రాజీపడే కేసులను రానున్న లోక్ అదాలత్‌లో పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ డి. ప్రీతీ, స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ బి. రాజేశ్వర్, ఏసీపీ వెంకట్ స్వామి, ఇన్‌స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, సృజన్ రెడ్డి, ఖరీముల్లా ఖాన్, సంతోష్ కుమార్, సునీల్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు , కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి