ప్రజాతెలంగాణ-కరీంనగర్ క్రైమ్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం కరీంనగర్ పట్టణంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్ర శోభా యాత్ర రూట్‌ను సీపీ గౌస్ ఆలం పరిశీలించారు . బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు .యాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకట్ స్వామి , ఇన్‌స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్ , సృజన్ రెడ్డి , ఖరీముల్లా ఖాన్ , పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :