పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం సరిగా అమలు చేయాలి – పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం 

ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం ను సరిగ్గా అమలు చెయ్యాలని ,సీసీసీ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం అన్నారు.  నెలవారీ నేరసమీక్ష సమావేశంలో భాగంగా శనివారం  కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫెరెన్స్ హాలులో  కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి వారి పరిధిలోని పోలీసు స్టేషన్లను తరుచూ సందర్శిస్తూ వారి పనితీరును పర్యవేక్షించాలన్నారు. డివిజన్ ల వారీగా ఏసీపీ అధికారులు డివిజన్ స్థాయిలో ప్రతినెల నేర సమీక్షలు నిర్వహించాలన్నారు. ఆకస్మాత్తుగా తలెత్తే శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడు సంసిద్ధంగా వుండలన్నారు.

ఎస్ హెచ్ ఓ గా విధులు నిర్వహిస్తున్న ఎస్సై , ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు పోలీసు స్టేషన్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలీసుస్టేషన్ మరియు పరిసరాలు కనీస శుభ్రతను పాటించేలా చూడాలన్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాదీనంలో ఉన్న వాహనాలు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. పట్టుబడి పోలీసు స్టేషన్లలో వదిలివేయబడిన వాహనాలను వేలం వేయుటకు పై అధికారులకు తెలపాలన్నారు.రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్ బుక్ ల ఏర్పాటు, సమన్లు మొదలుగు విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.

డివిజన్ మొత్తాన్ని సెక్టార్లుగా విభజించాలని ప్రతి సెక్టార్ కి గాను ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్ లను ఇంచార్జ్ అధికారులుగా నియమించాలని, తిరిగిసెక్టార్లను, ఒకే మార్గంలో వుండే రెండు మూడు గ్రామాలని కలిపి సబ్ సెక్టర్లుగా విభజించి వాటికి పోలీసు కానిస్టేబుళ్లను కేటాయించాలని సూచించారు. దీని ద్వారా క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రజలకు సేవలందించగలమన్నారు.రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.

గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా మరియు పి.డి.ఎస్. బియ్యం, పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం, వంటి వాటిని గుర్తించి తగిన కేసులు నమోదు చేసి, వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు.గంజాయిని నిర్మూలించేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా స్థానిక పాఠశాల, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నందున, వాటి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు.రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ హోల్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు.

డివిజన్ లోని పోలీసుస్టేషన్లకు మరియు అధికారులకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలను ఆయన తనిఖీ చేసారు. వాహనాలను సక్రమంగా వాడుకోవాలన్నారు. డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సరైన శిక్షణ అందించాలన్నారు.రానున్న రోజుల్లో వచ్చే పండుగలైన రంజాన్ , శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుతో పాటు తగిన భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఐపీఎస్ , కొత్తపల్లి ఎస్ హెచ్ ఓ గా విధులు నిర్వహిస్తున్న వసుంధర ఐపీఎస్ , ఇన్స్పెక్టర్లు ప్రదీప్ (రూరల్), ప్రకాష్ (చొప్పదండి ), స్వామి (తిమ్మాపూర్ ) లక్ష్మీనారాయణ (మానకొండూర్) సంతోష్ కుమార్ (సీసీఆర్బి) ,డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఎస్సై లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తల కోసం :

మాదక ద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!