ప్రజాతెలంగాణ – చిగురుమామిడి: గత పదేళ్లు అధికారంలో ఉండి బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను నిర్వీర్యం చేసిందని, అధికారం కోల్పోయాక బిఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ విమర్శించారు.ఆదివారం చిగురుమామిడి మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పదవిలో ఉన్నన్నాళ్లు ఎప్పుడూ వారు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం తో నిరుద్యోగులందరు ఏకమై కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పారన్నారు.తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలు రద్దు చేస్తామన్న హామీని తుంగలో తొక్కడమే కాకుండా , 317 జీవో తీసుకొచ్చి స్పవుస్ నియమకాలు కూడా చేపట్టలేదన్నారు . ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వకుండా 5% ఐఆర్ ప్రకటించి, 2.5% డిఏ పెండింగ్లో ఉంచారని , రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని వయోపరిమితిని 55 నుంచి 61 సంవత్సరాలకు పెంచారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు.గత డీఎస్సీలో 5 వేల ఉద్యోగాలను రెట్టింపు చేసి 11 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది అని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగస్తుల 48 డిమాండ్లలోని ఆర్థిక అంశాలను దఫాలవారీగా, ఇతర అంశాలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని కమిటీ వేసిందని గుర్తుచేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడంలో గాని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలన్న టిఆర్ఎస్ నాయకుల దుర్మార్గమైన ఆలోచనను ప్రజలే తిప్పికొడతారన్నారు.ఈ సమావేశం లో సుందరగిరి దేవస్థానం డైరెక్టర్ పూల లచ్చిరెడ్డి, దూల్మిట్ట నరసింహ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పొన్నం సంపత్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :