ప్రజా తెలంగాణ – కరీంనగర్ : రక్తసంబంధికుల నుండి దత్తత తీసుకున్న దంపతులకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా మంగళవారం దత్తత ఉత్తర్వులు అందజేశారు. కరీంనగర్ కు చెందిన దంపతులు వారి కుటుంబ సభ్యుల నుండి 11 సంవత్సరాల బాలికను దత్తత తీసుకున్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోగా వారికి కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు, రక్తసంబంధ దత్తత తీసుకోవాల్సిన వారు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయంలో గల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, కరీంనగర్ లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ ధనలక్ష్మి, ,డిసిపిఓ పర్వీన్, ఎల్ సి పి ఓ రాజు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :