ప్రజాతెలంగాణ- కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో జిల్లా స్థాయి మాతృ మరణ కమిటీ (MDR) సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం లో కమిటీ సభ్యులతో ఇటీవలి ప్రసూతి మరణాలపై సమగ్రంగా చర్చించామన్నారు. వైద్య సంరక్షణలో జాప్యాలు, అత్యవసర సేవల అందుబాటు, రిఫెరల్ వ్యవస్థ, ప్రసవానంతర సంరక్షణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రసూతి ఆరోగ్య సేవల మెరుగుదలకు, నివారించదగిన మాతృ మరణాలను తగ్గించేందుకు నిర్దిష్ట చర్యలను కమిటీ సభ్యులకు సూచించడం జరిగిందన్నారు .ఈ సమావేశంలో పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియా, పిఓడిటి డాక్టర్ ఉమాశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, గైనకాలజిస్ట్ డాక్టర్ సుహాసిని, అనస్థటిస్ట్ డాక్టర్ సంగీత, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి, డెమో రాజగోపాల్ సహా ఇతర వైద్య అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :