ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే వెంకటేష్ , అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీ ఆధ్వర్యంలో చింతకుంట గ్రామంలోని ఎంఆర్బీ ఇటుక బట్టి లో తనిఖీ నిర్వహించారు.తనిఖీ సమయంలో పనిచేస్తున్న కార్మికులకు అందుతున్న జీతభత్యాలు మరియు వారి సమస్యల గురించి వివరంగా తెలుసుకున్నారు. కార్మికులకు లభిస్తున్న సౌకర్యాల గురించి కూడా పరిశీలించారు. కార్మికులకు వారి హక్కులను కాపాడుకోవడం గురించి అవగాహన కల్పించారు. కార్మికులకు ఏ విధమైన చట్టపరమైన సమస్య తలెత్తినా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :