ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలకు దోస్త్ మూడో విడత అడ్మిషన్లలో 7629 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కోఆర్డినేటర్ డా.శ్రీరంగ ప్రసాద్ తెలిపారు.విశ్వవిద్యాలయ పరిధిలోని మొత్తం 36,060 సీట్లలో మొదటి, రెండవ విడతలలో 9455 సీట్లు కేటాయించగా, వాటిలో 6730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకోగా, ఇంకా 29,330 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మూడో విడత ప్రక్రియ నిర్వహించారు.13 ప్రభుత్వ కళాశాలలలో 1060 మంది విద్యార్థులకు, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలలో 1046 మంది విద్యార్థులకు , 60 ప్రైవేట్ కళాశాలలలో 5523 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 1, 2025 లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోవాలని ,లేని పక్షంలో సీట్ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని కోఆర్డినేటర్ తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :