కరీంనగర్-తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభం

ప్రజా తెలంగాణ – కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు ప్రారంభం చేయనున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. జూలై 6 నుండి జూలై చివరివరకు ఈ రైలు నడిపించనున్నారు.వారానికి రెండుసార్లు నడుపుతారుఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో సోమవారం సాయంత్రం 5:30కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25కి తిరుపతి చేరుకుంటుంది.కరీంనగర్ నుంచి తిరుపతికి నిత్యం రైలు నడిపించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ రైలు ద్వారా తిరుపతి వెళ్లే ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గత నెల 22న కరీంనగర్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా మరోసారి విజ్ఞప్తి చేశారు.ప్రయాణికుల రద్దీని బట్టి ఈ ప్రత్యేక రైలు రెగ్యులర్‌గా నడిచే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు వేసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహకరించిన కేంద్రమంత్రి బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక రైలును ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

మరిన్ని వార్తల కోసం :   పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్ పమేలా సత్పతి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!