ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్‌కుమార్ తెలిపారు.మానేరు డ్యాం సమీపంలో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫార్మకాలజీ, ఫార్మాసిటిక్స్, ఫార్మాసిటికల్ అనాలసిస్ విభాగాలలో ఒక్కొక్కటిలో 15 సీట్లు చొప్పున మొత్తం 45 సీట్లతో ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభం కానుందని వారు వెల్లడించారు.ఎంతోకాలంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది శుభవార్త అని ఉపకులపతి పేర్కొన్నారు. ఇదే కళాశాలలో బీ.ఫార్మసీ అభ్యసించిన విద్యార్థులు ఇకపై మాస్టర్స్ చదువుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని వారు తెలిపారు.ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయ అభివృద్ధికి తాము చేస్తున్న కృషిలో భాగంగా ఈ విద్యా సంవత్సరం లా కోర్స్, ఇంజనీరింగ్ కళాశాల మంజూరులు లభించిన సంగతి తెలిసిందని ఉమేష్‌కుమార్ గుర్తుచేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా కొన్ని సాంప్రదాయ, సాంప్రదాయేతర కోర్సులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వారు వెల్లడించారు.కరీంనగర్‌ను విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఉపకులపతి తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :
కరీంనగర్-తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభం