ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్ : దుర్శేడ్ గ్రామానికి చెందిన వేముల స్వప్న, వానరాసి స్వప్న లకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర హరీష్ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరిగిందని తెలిపారు .అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మాజీ సర్పంచ్ గాజుల అంజయ్య, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఉపాధ్యక్షులు పాలకుర్తి లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మురళీ కృష్ణ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :