ప్రజా తెలంగాణ – కరీంనగర్ : జిల్లాలో ఇదివరకే మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొదటి దఫా మంజూరైన 2027 ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు. ఈ వారాంతంలోగా అన్ని ఇండ్లకు మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. 15 రోజుల్లోగా మంజూరైన అన్ని ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కు చేరాలని అన్నారు. హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీ, మునిసిపల్ అధికారులు సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. లబ్ధిదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పనులను ఈనెల 25 లోగా పూర్తి చేయాలన్నారు. మొదటి విడత చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, డిఆర్డిఓ వేణు మాధవ్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :
One thought on “ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి- కలెక్టర్ పమేలా సత్పతి”