ప్రజా తెలంగాణ-కరీంనగర్: అనారోగ్యంతో బాధపడుతున్న క్లర్క్ ఆరెల్లి సాగర్ గౌడ్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం కరీంనగర్ బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. ఈ క్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ సెక్రటరీ సుంకే దేవకిషన్ సేకరించిన విరాళం రూ.42 ,000/- లను సాగర్ కు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సాగర్‌కు అండగా నిలిచి ఆర్థిక సహాయం చేసిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :
చొప్పదండిలో పద్మశాలి సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారం


