ప్రజా తెలంగాణ-కరీంనగర్ : కరీంనగర్ కు న్యాయ కళాశాలను మంజూరు చేయడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎనలేనిదని స్టేట్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్ అన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయ కళాశాలను మంజూరు చేయిస్తే బిజెపి నాయకులు తమ ఖాతాలో వేసుకోవడం విడ్డూరమన్నారు. న్యాయ కళాశాల మంజూరు విషయంలో కృషిచేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు మరోసారి కాంగ్రెస్ లీగల్ సెల్ తరపున ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్ వడ్లూరి కృష్ణ, జిల్లా కన్వీనర్ కొత్తకొండ శంకర్, లింగంపల్లి శ్రీకాంత్ , కో కన్వీనర్ ఐతు సృజన్, న్యాయవాదులు తునికి పవన్ కుమార్, గౌతమ్, జేరిపోతుల మహేందర్, మురళి మనోహర్ , కొత్త ప్రకాష్ , తాండ్ర భూమేష్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :