ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు : టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ బుధవారం కరీంనగర్ జిల్లా కోర్ట్ కు విచ్చేసిన సందర్భంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు శాలువా కప్పి సన్మానించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కరీంనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజుకు పొన్నం అశోక్ గౌడ్ శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ తను మొదట న్యాయవాది గా ప్రాక్టీస్ చేసిన బార్ కు చాల రోజుల తర్వాత రావడం, తన పాత మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ బాధ్యులు భూక్యా రజనీష్, ఆర్ దేవేందర్ రెడ్డి, రాచకొండ ప్రభాకర్, పంజాల కుమార స్వామి,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
స్టేట్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కు సన్మానం
