– రూ. 3.65 లక్షల నగదు ,14 సెల్ ఫోన్లు స్వాధీనం
ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ :కరీంనగర్ రూరల్ పరిధిలోని రేకుర్తిలోని పేకాట స్థావరంపై బుధవారం సీఐ ఏ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుండి రూ. 3,65,760 నగదు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సి ఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని , త్వరలో కోర్టులో చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :