ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కొత్తగా నియమితులైన వారిలో జిల్లా వైస్ చైర్మన్లుగా కొత్త నరసింహారెడ్డి, చల్ల వెంకటరమణారెడ్డి, బొడ్డు రాజు, ఎండి చాంద్, మల్యాల ప్రతాప్లు ఉన్నారు. అదేవిధంగా కన్వీనర్లుగా గసిగంటి కొమురయ్య, జేరిపోతుల మహేందర్లను నియమించగా, జాయింట్ కన్వీనర్లుగా గడ్డం అవినాష్ రెడ్డి, ఆడెపు గౌతమ్ రాజు, తాండ్ర భూమేశ్వర్లకు బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం :
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి