CORRESPONDENT - KARIMNAGAR

వలస కార్మికుల పిల్లలకు విజయవంతంగా విద్యా బోధన

–   విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ -కరీంనగర్ : జిల్లాలోని సుమారు 500 మంది వలస కార్మికుల పిల్లలకు ప్రత్యేక పాఠశాలల్లో విజయవంతంగా విద్యాబోధన పూర్తి చేయనున్నామని, కార్మికుల పిల్లలందరినీ చదువు వైపు ఆకర్షించామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.కలెక్టరేట్ ఆడిటోరియంలో వలస కార్మికుల పిల్లలు, ఉపాధ్యాయులు, యజమానులతో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు చదువుకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో…

మరింత

స్టేట్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కు సన్మానం

ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు : టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ బుధవారం కరీంనగర్ జిల్లా కోర్ట్ కు విచ్చేసిన సందర్భంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు శాలువా కప్పి సన్మానించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కరీంనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజుకు పొన్నం అశోక్ గౌడ్ శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ తను మొదట న్యాయవాది గా ప్రాక్టీస్ చేసిన బార్…

మరింత

ఎస్ యూ లో లా డిగ్రీ కోర్స్ కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి యు ఉమేష్ కుమార్ తెలిపారు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, కొత్త కోర్సుల మౌలిక ఏర్పాటు లో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దీనికి తోడ్పాటు అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ , కేంద్ర మంత్రివర్యులు బండి…

మరింత

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి

– కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : ఈమధ్య కాలంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు. సెల్ ఫోన్లో వస్తున్న వివిధ రకాల మెసేజ్ లను గుడ్డిగా నమ్మి తెరవకూడదని సూచించారు. బుధవారం నాడు కొత్తపల్లి మండలం రేకుర్తి లోని లయోలా కాలేజీ ఆవరణలో దేశ సైన్యం,  రక్షణ విభాగాల్లో ఉద్యోగాల…

మరింత

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి- కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ :  జిల్లాలో ఇదివరకే మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొదటి దఫా మంజూరైన 2027 ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు. ఈ వారాంతంలోగా అన్ని ఇండ్లకు మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. 15 రోజుల్లోగా మంజూరైన అన్ని ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కు…

మరింత

భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

–   కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ- కరీంనగర్ రూరల్ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ మండలం సైదాపూర్ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామపంచాయతీ భవనంలో, బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు…

మరింత

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కార్పస్ ఫండ్ అందజేత

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ జి. రాజిరెడ్డి కుటుంబానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మంగళవారం కార్పస్ ఫండ్ చెక్కును అందజేశారు. రామడుగు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి కరీంనగర్ కమిషనరేట్‌లోని ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూ గత డిసెంబర్ నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, రాజిరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా…

మరింత

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

–  కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి ప్రజాతెలంగాణ- కరీంనగర్ రూరల్ : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు .మంగళవారం నాడు కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ సాంబ మూర్తి లు ఇసుక అక్రమ రవాణా- చట్టపరమైన చర్యలు అంశంపై ఎలగందల్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ…

మరింత

ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్  :  దేశ ప్రజల రక్షణకు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి (సాయుధ దళాలు) మద్దతుగా  టీఎన్జీవో, టీజీవో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో   సోమవారం జిల్లా కేంద్రంలో  నిర్వహించిన   సంఘీభావ ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది . ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ఎన్ సీ సీ కేడేట్లు, నగరపాలిక కార్మికులు,…

మరింత

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మే 14 నుండి డిగ్రీ పరీక్షలు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు టైం టేబుల్ ప్రకారం మే 14 నుండి యథావిధిగా ప్రారంభం అవుతాయని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. డి సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు.పరీక్ష ఫీజులు చెల్లించిన కాలేజి విద్యార్థులకే పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇంకా పరీక్ష ఫీజ్ చెల్లించని అనేక ప్రైవేట్ కళాశాలలు 12వ తేదీ లోగా ఫీజులు చెల్లిస్తాయని…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!