ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియాతో కలిసి కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రాలలోని హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, ఫార్మసీ స్టోర్లలోని మందుల నిల్వలు మరియు రికార్డులను పరిశీలించారు.13 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులలో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించారు. షుగర్ వ్యాధి…

మరింత

ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి – సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా తెలంగాణ – వెబ్ డెస్క్ : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వ్యవసాయ శాఖ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.గత సంవత్సరం కంటే 22 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా మొత్తం 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సీఎం తెలిపారు. 10.5 లక్షల మంది…

మరింత

నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి – డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదటి కాన్పుల్లో గర్భవతులను సాధారణ డెలివరీ కోసం ప్రోత్సహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు .సోమవారం ఆయన అధ్యక్షతన మహిళా సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో  మాట్లాడుతూ గైనకాలజీ డాక్టర్ చేత హెల్త్ చెకప్ చేయిస్తూ సిజేరియన్ డెలివరీల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను గర్భిణీలకు తెలియజేయాలని సూచించారు.30 సంవత్సరాలకు మించిన వారందరికీ అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా…

మరింత

బహిరంగ ప్రదేశంలో జూదం: ఐదుగురు అరెస్ట్

ప్రజాతెలంగాణ -కరీంనగర్ రూరల్ : మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేగురుపల్లి గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అక్రమంగా జూదం ఆడుతున్న ఐదుగురిని సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.10,460 నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తము మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు. జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన…

మరింత

బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు – రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ తెరిచి ఉండే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నారు . దీని వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ,మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొందరు గంజాయికి…

మరింత

తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించడమే లక్ష్యం- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

ప్రజాతెలంగాణ -కరీంనగర్: తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు .కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తానాకాన్’ 11వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.వైద్యం సేవా దృక్పథంతో కూడినదని, వైద్యులు సమాజ శ్రేయస్సు కోరుకుంటారని , వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆరోగ్య మంత్రి దామోదర్‌రాజనర్సింహ దృష్టికి…

మరింత

ముగిసిన గ్రామ పాలన అధికారుల నియామక పరీక్ష

– పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ-కరీంనగర్ :  గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణ కోసం ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల (జిపిఓ) నియామక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లెక్టర్ సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రస్తుత…

మరింత

ఎంఆర్బీ ఇటుక బట్టిలో అధికారుల తనిఖీలు

ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే వెంకటేష్ , అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీ ఆధ్వర్యంలో చింతకుంట గ్రామంలోని ఎంఆర్బీ ఇటుక బట్టి లో  తనిఖీ నిర్వహించారు.తనిఖీ సమయంలో పనిచేస్తున్న కార్మికులకు అందుతున్న జీతభత్యాలు మరియు వారి సమస్యల గురించి వివరంగా తెలుసుకున్నారు. కార్మికులకు లభిస్తున్న సౌకర్యాల గురించి కూడా పరిశీలించారు. కార్మికులకు వారి హక్కులను కాపాడుకోవడం గురించి అవగాహన కల్పించారు. కార్మికులకు ఏ విధమైన చట్టపరమైన సమస్య…

మరింత

లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ  రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కొత్తగా నియమితులైన వారిలో జిల్లా వైస్ చైర్మన్లుగా కొత్త నరసింహారెడ్డి, చల్ల వెంకటరమణారెడ్డి, బొడ్డు రాజు, ఎండి చాంద్, మల్యాల ప్రతాప్లు ఉన్నారు. అదేవిధంగా కన్వీనర్లుగా గసిగంటి కొమురయ్య, జేరిపోతుల మహేందర్లను నియమించగా, జాయింట్ కన్వీనర్లుగా…

మరింత

పేకాటరాయుళ్ల అరెస్టు

– రూ. 3.65 లక్షల నగదు ,14 సెల్ ఫోన్లు స్వాధీనం ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ :కరీంనగర్ రూరల్ పరిధిలోని రేకుర్తిలోని పేకాట స్థావరంపై బుధవారం సీఐ ఏ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుండి రూ. 3,65,760 నగదు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సి ఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!