కరీంనగర్ టూ టౌన్ ఎస్ ఐ చంద్రశేఖర్ బలవన్మరణం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ చంద్రశేఖర్ బలవన్మరణం చెందారు. ఇటీవల ఆయన భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భార్య మృతి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మరిన్ని వార్తల కోసం : అవినీతి నిరోధక శాఖ…

మరింత

అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఎక్సైజ్ సీఐ

ప్రజాతెలంగాణ – కరీంనగర్ :  బుధవారం  కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలతో సదరు సి ఐ ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.     మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

మరింత

ఎఫ్ ఈ ఎస్ డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ & సోషల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.చికిత్స పొందుతున్న రోగులకు అరటిపండ్లు, ఆపిల్‌లతో కూడిన ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్య, సామాజిక అభివృద్ధి రంగాలలో కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో హరికృష్ణ, వేములవాడ అనిల్‌కుమార్, మీర్జా అనిల్, సాయిచందర్, సంజయ్, సాగర్,…

మరింత

ఘనంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

ప్రజాతెలంగాణ – కరీంనగర్:  జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  అని,  ఆయన ఇలాంటి  పుట్టినరోజు వేడుకలు  ఎన్నో జరుపుకోవాలని అన్నారు. గతంలో వారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని…

మరింత

అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి

అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- డీ డబ్ల్యు ఓ ఎం. సరస్వతి ప్రజా తెలంగాణ -కరీంనగర్ : జూన్ 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేందుకు మహిళా శిశు సంక్షేమ అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు.శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి మేధో మథన సదస్సులో మంత్రి…

మరింత

కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ పట్టణం లోని కోతిరాంపూర్‌లో గల ఎలైట్ వరల్డ్ స్కూల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం పాఠశాల నిర్వాహకుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్య, శ్రేష్ఠత మరియు సాధికారతలో పరివర్తనాత్మక ప్రయాణానికి ఈ పాఠశాల ప్రారంభం నాంది అవుతుందని అభిప్రాయపడ్డారు.స్కూల్ కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ మాట్లాడుతూ, కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా పాఠశాలను ప్రారంభించుకోవడం తమకు…

మరింత

జూన్ 1న ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం : పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా ,అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎలైట్ వరల్డ్ స్కూల్ జూన్ 1,ఆదివారం రోజున కోతిరాంపూర్ లో ప్రారంభిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ ఒక ప్రకటన లో తెలిపారు.నర్సరీ నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సిలబస్ తో పాటు ,సీబీఎస్ఈ విద్యా విధానంలో ఉత్తమమైన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పలువురు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజ…

మరింత

బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు – రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ తెరిచి ఉండే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నారు . దీని వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ,మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొందరు గంజాయికి…

మరింత

లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ  రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కొత్తగా నియమితులైన వారిలో జిల్లా వైస్ చైర్మన్లుగా కొత్త నరసింహారెడ్డి, చల్ల వెంకటరమణారెడ్డి, బొడ్డు రాజు, ఎండి చాంద్, మల్యాల ప్రతాప్లు ఉన్నారు. అదేవిధంగా కన్వీనర్లుగా గసిగంటి కొమురయ్య, జేరిపోతుల మహేందర్లను నియమించగా, జాయింట్ కన్వీనర్లుగా…

మరింత

భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం

– బాధితులకు అందిస్తున్న సేవలు, కేసుల పురోగతిపై సమీక్ష ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!