న్యాయ కళాశాల మంజూరులో మంత్రి పొన్నం కృషి ఎన లేనిది- లీగల్ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్
ప్రజా తెలంగాణ-కరీంనగర్ : కరీంనగర్ కు న్యాయ కళాశాలను మంజూరు చేయడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎనలేనిదని స్టేట్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్ అన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయ కళాశాలను మంజూరు చేయిస్తే బిజెపి నాయకులు తమ ఖాతాలో వేసుకోవడం విడ్డూరమన్నారు. న్యాయ కళాశాల మంజూరు విషయంలో కృషిచేసిన రాష్ట్ర…


