ముగిసిన గ్రామ పాలన అధికారుల నియామక పరీక్ష

– పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ-కరీంనగర్ :  గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణ కోసం ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల (జిపిఓ) నియామక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లెక్టర్ సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రస్తుత…

మరింత

ఎంఆర్బీ ఇటుక బట్టిలో అధికారుల తనిఖీలు

ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే వెంకటేష్ , అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీ ఆధ్వర్యంలో చింతకుంట గ్రామంలోని ఎంఆర్బీ ఇటుక బట్టి లో  తనిఖీ నిర్వహించారు.తనిఖీ సమయంలో పనిచేస్తున్న కార్మికులకు అందుతున్న జీతభత్యాలు మరియు వారి సమస్యల గురించి వివరంగా తెలుసుకున్నారు. కార్మికులకు లభిస్తున్న సౌకర్యాల గురించి కూడా పరిశీలించారు. కార్మికులకు వారి హక్కులను కాపాడుకోవడం గురించి అవగాహన కల్పించారు. కార్మికులకు ఏ విధమైన చట్టపరమైన సమస్య…

మరింత

అత్యాధునిక వైద్యానికి కేరాఫ్ ప్రభుత్వాసుపత్రులు – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకునేలా వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శాఖ పనితీరు మరియు మాతృ శిశు సంక్షేమ చర్యలపై సమీక్ష నిర్వహించారు.ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఆసుపత్రులను ఇంటిలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే…

మరింత

లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ  రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కొత్తగా నియమితులైన వారిలో జిల్లా వైస్ చైర్మన్లుగా కొత్త నరసింహారెడ్డి, చల్ల వెంకటరమణారెడ్డి, బొడ్డు రాజు, ఎండి చాంద్, మల్యాల ప్రతాప్లు ఉన్నారు. అదేవిధంగా కన్వీనర్లుగా గసిగంటి కొమురయ్య, జేరిపోతుల మహేందర్లను నియమించగా, జాయింట్ కన్వీనర్లుగా…

మరింత

పేకాటరాయుళ్ల అరెస్టు

– రూ. 3.65 లక్షల నగదు ,14 సెల్ ఫోన్లు స్వాధీనం ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ :కరీంనగర్ రూరల్ పరిధిలోని రేకుర్తిలోని పేకాట స్థావరంపై బుధవారం సీఐ ఏ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుండి రూ. 3,65,760 నగదు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సి ఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని…

మరింత

రాజీ కేసుల పరిష్కారానికి చర్యలు

కరీంనగర్ పోలీస్ కమిషనర్-ప్రిన్సిపల్ జడ్జి సమావేశం ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు :  కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎస్. శివకుమార్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 14న జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే కేసులను కోర్టుల వారీగా పరిష్కరించాలని ఈ సందర్భంగా కమిషనర్ జడ్జిని కోరారు. సమన్వయ సమావేశంలో పెండింగ్ కేసుల సమీక్ష లోక్ అదాలత్ సన్నద్ధతలో భాగంగా, బుధవారం కోర్టు ఆవరణలోని మీటింగ్…

మరింత

హిందూ ఏక్తా యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు – సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ-కరీంనగర్ క్రైమ్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం  కరీంనగర్ పట్టణంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్ర శోభా యాత్ర రూట్‌ను సీపీ గౌస్ ఆలం పరిశీలించారు . బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు .యాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా…

మరింత

భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం

– బాధితులకు అందిస్తున్న సేవలు, కేసుల పురోగతిపై సమీక్ష ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని…

మరింత

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు .విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపెల్లిలోని సెయింట్ జార్జ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదు రోజుల ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధనతో పాటు తాము కూడా కొత్త అంశాలను నేర్చుకోవడం అవసరం. ప్రభుత్వం అధిక…

మరింత

మాతృ మరణాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో జిల్లా స్థాయి మాతృ మరణ కమిటీ (MDR) సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం లో కమిటీ సభ్యులతో ఇటీవలి ప్రసూతి మరణాలపై  సమగ్రంగా చర్చించామన్నారు. వైద్య సంరక్షణలో జాప్యాలు, అత్యవసర సేవల అందుబాటు, రిఫెరల్ వ్యవస్థ, ప్రసవానంతర సంరక్షణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రసూతి ఆరోగ్య సేవల మెరుగుదలకు,…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!